Veerayya Title Song Lyrics in Telugu - Waltair Veerayya | Megastar Chiranjeevi, Shruti Haasan Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Chandrabose |
Singer : | Anurag Kulkarni Alaap: Pavithra Chari |
Composer : | Devi Sri Prasad |
Publish Date : | 2022-12-27 00:00:00 |
భగ భగ భగ భగ
మగ మగ మగ మగాడురా వీడే
జగ జగ జగ జగ చెడు
జగాన్ని చెండాడే
ధగ ధగ ధగ ధగ
జ్వలించు సూరీడే
అగాధ గాధల అనంత లోతుల
సముద్ర సోదరుడే వీడే
వినాశ కారుల స్మశానమవుతాడే
తుఫాను అంచున
తపస్సు చేసే వసిష్ఠుడంటే అది వీడే
తలల్ని తీసే విశిష్టుడే వీడే హే
వీరయ్య వీరయ్య వీరయ్య వీరయ్య
మృగ మృగ మృగ
మృగాన్ని వేటాడే
పగ పగ పగ పగ
ప్రతిధ్వనించే శాతాగ్ని రా వీడే
భుగ భుగ భుగ భుగ
విషాన్ని మింగాడే
తెగ తెగ తెగ తెగ
తెగించి వచ్చే త్రిశూలమయ్యాడే
ఏక ఏక ఎకి
యముండు రాసే కవిత్వమంటే
అది వీడే
నవ శకాన్ని ఎర్రని కపోతమే వీడే
తరాలు చూడని
యుగాలు చూడని
సముద్ర శిఖరం అది వీడే
తనొక్క తానే తలెత్తి చుస్తాడే
వీరయ్య వీరయ్య వీరయ్య వీరయ్య
డం డం ఢమ ఢమ
అగ్ని వర్షమై అడుగులేసిన అసాద్యుడే
భం భం బడ బడ
మృత్యు జననమై ముంచుకొచ్చిన అనంతుడే
రం రం రగ రగ
శౌర్య సంద్రమై ఆక్రమించిన అమత్యుడే
ధం ధం దబ దబ
యుద్ధ శకటమై ఎగిరి దూకిన అబేద్యుడే
తం తం తక తక
తిమిన నేత్రమై ఆవహించిన త్రినేత్రుడే
గం గం గడ గడ
మరణ శంకమై మారు మోగిన ప్రశాంతుడే
వీరయ్య వీరయ్య వీరయ్య వీరయ్య