Veyi Janmalaina Song telugu Love Failure song Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | HANUMAYYA BANDARU |
Singer : | SINGER RAMU |
Composer : | KETHAN ADITHYA PALEP |
Publish Date : | 2023-10-28 09:36:56 |
ప్రాణాలు పోసిన ఆదేవుడే ప్రాణాలె తీస్తుంటడెందుకురా
ప్రేమను పంచిన ఈజీవుడే ప్రేమనె చంపేస్తడెందుకురా
ప్రాణాలు పోసిన ఆదేవుడే ప్రాణాలె తీస్తుంటడెందుకురా
ప్రేమను పంచిన ఈజీవుడే ప్రేమనె చంపేస్తడెందుకురా
కాలానికేమి దయలేని రాజు ఏమయినగాని ఆగదురా
నీలోని ప్రేమ నీతోనె లేదు ఏతోడు లేదు బాధేనురా
రాతను రాసే పైవాడుకుడా నీతో ఆడే చూడరా
శంకరా శంకరా నీకళ్ళల్లో కన్నీటి ప్రవాహమే
శంకరా శంకరా నీగుండెల్లో ప్రేమకు అభిషేకము
శంకరా శంకరా నీప్రేమలొ వెన్నెల కాచునులే
శంకరా శంకరా నీఅడుగుల్లో సందడి చేరునులే
ఏతోడు లేని నీకోసమే నీప్రేమ నీగుడు చేరే
నీజీవితాన దీపాల వాన కురిసెను ఏదీవెనో
నటరాజులోన నువు ప్రాణమే నువు లేనిదే ఆడలేడే
ఈపేద ప్రేమ నీఊపిరేగ వెలగాలి కలకాలమే
ఈరోజు నీరోజు ఏడడుగులేసారు నూరేళ్ళు మీవేలే
నీలోని ఆరాధనే చూసి చీకట్లు జారుకోనిపోవాలే
లోకాన మీరు ఏకాకి కారు ఆనింగినేల మీ బంధువులే
వీచేటిగాలి స్నేహాన మీరు ఏబాధలేక సాగాలిలే
ప్రేమలో మీరు ఇక ఓడిపోరు మీకు మీరె సాటిలే
శంకరా శంకరా నీకళ్ళల్లో కన్నీటి ప్రవాహమే
శంకరా శంకరా నీగుండెల్లో ప్రేమకు అభిషేకము
శంకరా శంకరా నీప్రేమలొ వెన్నెల కాచునులే
శంకరా శంకరా నీఅడుగుల్లో సందడి చేరునులే
మరణమే లేదులే ప్రేమకు ప్రియతమా
మనసులో చేరితే ప్రేమా మధురిమా
ఏడు అడుగులేసినాముగా ప్రియతమా
వేయి జన్మలైన వదులుకోను ప్రాణమా
ఊరూరు కదిలె నీకోసమే బోనాలు ఎత్తారు చూడు
నీఊరి వారు నీపైన ప్రేమ తెలిపారు ఈతీరుగా
ఎదురైన వీరు రాక్షసులే ఏపూజలూ జరగనీరే
ఆదేవతేలె ఈపోతురాజై తరిమేను పొలిమేరకే
వేలాది బోనాలు ఆతల్లికి చేరేను తీర్చునులె నీకష్టమే
మీ ప్రేమ పోరాటమే చూసి వానొచ్చి కంటనీరు తుడిచెనే
ఆనందమేలె అపురూపమేలె మీ ప్రేమ పోరు ఆదర్శమే
మీ జంటలోన పొంగేటి ప్రేమ తీరాలు లేని సాగరమే
నీతిని చూసే ఏదేవుడైనా దారి చూపును సోదరా
శంకరా శంకరా నీకళ్ళల్లో కన్నీటి ప్రవాహమే
శంకరా శంకరా నీగుండెల్లో ప్రేమకు అభిషేకము
శంకరా శంకరా నీప్రేమలొ వెన్నెల కాచునులే
శంకరా శంకరా నీఅడుగుల్లో సందడి చేరునులే