Vinave Vinave Official Full Song - Raja Rani | Telugu Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Anantha Sriram |
Singer : | G.V.Prakash Kumar, Shakthisree Gopalan |
Composer : | G V Prakash |
Publish Date : | 2023-01-06 00:00:00 |
వినవే వినవే మనసా వినవే
నువు వేరైతే నేనే లేనే
హృదయం ఉదయం కనదే ఇకపై
క్షణమే యుగమై పడనీ మెదపై
మసక అంచు దారిలోకి ఎండలాగ చేరుమా
ఇసుక నిండు ఈ ఎడారిపైన వాన జల్లుమా
అణువణువు నీ వలపే
క్షణక్షణము నీ తలపే
అణువణువు నీ వలపే
క్షణక్షణము నీ తలపే
వినవే వినవే మనసా వినవే
నువు వేరైతే నేనే లేనే
హృదయం ఉదయం కనదే ఇకపై
క్షణమే యుగమై పడనీ మెదపై
ముసురు వేసి ఎండ రాకపోతే నింగి నేరమా
నదులలోన నీరు ఆవిరైతే నేల నేరమా
అణువణువు నీ వలపే
క్షణక్షణము నీ తలపే
అణువణువు నీ వలపే
క్షణక్షణము నీ తలపే