DreamPirates > Lyrics > Ye Kannulu Chudani - ArthaSatabdam | Sid Sri Ram Lyrics

Ye Kannulu Chudani - ArthaSatabdam | Sid Sri Ram Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-06 00:00:00

Ye Kannulu Chudani - ArthaSatabdam | Sid Sri Ram Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Rahman
Singer : Sid Sri Ram
Composer : Nawfal Raja AIS
Publish Date : 2022-09-06 00:00:00

Ye Kannulu Chudani - ArthaSatabdam |  Sid Sri Ram Lyrics


Song Lyrics :

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే
ఒక్క క్షణమే... చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో వనమై... ఎదిగేటి నువ్వనే వరం
అందుకే ఈ నేల నవ్వి... పూలు పూసేలే
గాలులన్ని నిన్ను తాకి... గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపేలే

ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

ఎంత దాచుకున్నా... పొంగిపోతూ ఉన్నా
కొత్త ఆశలెన్నో... చిన్ని గుండెలోన
దారికాస్తు ఉన్నా... నిన్ను చూస్తు ఉన్న
నువ్వు చూడగానే... దాగిపోతు ఉన్నా
నిన్ను తలచి... ప్రతి నిమిషం పరవశమై
పరుగులే తీసే... నా మనసు ఓ వెల్లువలా, తన లోలోనా

అందుకే ఈ నేల నవ్వి... పూలు పూసెలే
గాలులన్ని నిన్ను తాకి... గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపేలే
ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

స రి మ ప మ ప మ ప మ ప ని మ గ ప ని ని స
స రి ని స రి మ ప ని… స రి ని స రి మ ప ని స రి ని స రి మ
ప ని స మి ప స
నిగరిపదనిస మ నిగరిపదనిస
మ నిగరిపదనిస మ గరిగ సరిగమ స

ఆ రంగులద్దుకున్న సందెపొద్దులాగా
నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంటా
రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా
నిండు పున్నమల్లె నిన్ను నింపుకుంటా
ఎవరిదీ తెలియదులే మనసుకిది మధురములే
నాలోనే మురిసి ఓ వేకువలా... వెలుగై ఉన్నా.

అందుకే ఈ నేల నవ్వి... పూలు పూసేలే
గాలులన్ని నిన్ను తాకి... గంధమాయెలే
అందమైన ఊహలెన్నో ఊసులాడేలే
అంతులేని సంబరాన ఊయలూపేలే
ఏ కన్నులూ చూడనీ చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే

Tag : lyrics

Relative Posts