DreamPirates > Lyrics > Ye Vaipuku Saguthondi Song Lyrics

Ye Vaipuku Saguthondi Song Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-25 06:11:02

Ye Vaipuku Saguthondi Song Lyrics

Ye Vaipuku Saguthondi Song Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya Sastry
Singer : Shanakar Mahadevan
Composer : Ramajogayya Sastry
Publish Date : 2023-10-25 06:11:02


Song Lyrics :

ఏ వైపుకి సాగుతోంది ఆలోచనా
ఎటువైపో నీ పాదం పయనించెనా
కలగన్నా కాలమేదో సమీపించినా
ఇంకా నీలోన నీకు ఇదేం యాతనా

నిలకడగా నువ్ నీతో
లేనంటూ అలా
అలజడిగా అటు ఇటుగా
తడబడితే ఎలా

నిలకడగా నువ్ నీతో
లేనంటూ అలా
అలజడిగా అటు ఇటుగా
తడబడితే ఎలా

నీ తనువును ఆ బరువును
గమనించవే ఓసారి
ఎదురవ్వదా బదులివ్వదా
నువ్వు వెతికే రహదారీ

ఎక్కడికి ఈ పరుగు
ఎక్కడుంది నీ వెలుగు
ఎక్కడికి నీ పరుగూ
నీ మనసుని అడుగూ

ఎక్కడికి ఈ పరుగు
ఎక్కడుంది నీ వెలుగు
ఎక్కడికి నీ పరుగూ
నీ మనసుని అడుగూ

ఏ నిజం నిజమని
ఎవ్వరో తేల్చరే
ఏది నీ దారని
ఎవ్వరు చెప్పరే

నిన్నలు మొన్నలు
గడిచిన రోజులే
రేపులు మాపులు
నీ అడుగుజాడలే

ఎవరినో కాదనే తొత్తరాపాటులో
నిన్ను నువ్వే కాదనీ
ఏమారితే ఎలా?

నిర్ణయం నీదనే పాత అలవాటులో
మనసనే మాటనీ గుర్తించవేంటలా

ఎక్కడికి ఈ పరుగు
ఎక్కడుంది నీ వెలుగు
ఎక్కడికి నీ పరుగూ
నీ మనసుని అడుగూ

ఓ ఓ ఓ, ఏదో నిన్నాపుతోంది
నీలో నిన్నూ
ఏదో వెంటాడుతోంది
నీ పదాలను

చెయ్యార అందుకొన్న కోరే కలను
నెమ్మదిగా ఉంచావేంటో నీ మనస్సును

ఇది నువ్వా ఇది నువ్వా
నువు నువులా లేవే
నిను నువ్వే విననంటూ
గది మూసేసావే

ఇది నువ్వా ఇది నువ్వా
నువు నువులా లేవే
నిను నువ్వే విననంటూ
గది మూసేసావే

ఈ సోటునా, ఆ సోటునా
ఒక నీతో నువ్వేగా
నిను కుదిపిన ప్రతి ప్రశ్నకు
బదులైనా నీవేగా

Tag : lyrics

Watch Youtube Video

Ye Vaipuku Saguthondi Song Lyrics

Relative Posts