DreamPirates > Lyrics > నీ కృప లేని క్షణము ||Telugu christian song || Nissy paul Lyrics

నీ కృప లేని క్షణము ||Telugu christian song || Nissy paul Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-08 15:42:18

నీ కృప లేని క్షణము ||Telugu christian song || Nissy paul Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : P.John Wesley
Singer : Sis.Nissypaul
Composer : P.John Wesley
Publish Date : 2023-07-08 15:42:18

నీ కృప లేని క్షణము ||Telugu christian  song || Nissy paul Lyrics


Song Lyrics :

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) ||నీ కృప||

మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2) ||యేసయ్యా||

ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2) ||యేసయ్యా||

Tag : lyrics

Relative Posts