చుస్తున్నాడమ్మా యేసు || TELUGU CHRISTIAN SONG||Sung by Sis.G.s.Lavanya || Bro.Ch.Santhosh Reddy Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Sis.G.s.Lavanya |
Singer : | Sis.G.s.Lavanya |
Composer : | SAMUEL DARA |
Publish Date : | 2023-05-24 16:38:37 |
చూస్తున్నాడమ్మా యేసు చూస్తూన్నాడమ్మా..
కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తూన్నాడమ్మా...ఆ...
చూస్తున్నడమ్మ యేసు చూస్తున్నడమ్మ...
గుండెల్లో వేదనను చూస్తున్నాడమ్మ... ఆ...
చూసిన దేవుడూ దాటి పోడమ్మ...(2)
చేయిచాచి చేరదీసి దీవిస్తాడమ్మ...కన్నీరు తుడచి కరునిస్తాడమ్మ...
యేసయ్యా...ఆ..యేసయ్యా...ఆ..యేసయ్యా...ఆ... నా యేసయ్యా.... (2).
1. ఒంటరి బ్రతుకని నీవు అనుకుంటున్నావా -
చెలిమే లేదని నీవు చింతగ ఉన్నావా...? (2)
చేరదీయు దేవుడు - చెంతనే ఉన్నాడు చీకటి ఛాయలు -
చేరిపివేయుచున్నాడు (2) (చూస్తూ)
2. అవమనాలనీ... నిందలు అనీ.... ఏడుస్తున్నవా -
నీవు కుములుతున్నవా.? (2)
ఆదరించువాడు- నీ... యేసు దేవుడు
అందరిలో నిన్నూ.. - ఘనపరుచుతాడు (2) (చూస్తూ)
3. బ్రతుకంతా నాకు - బరువుగా ఉందని
బరించలేనని నీవు - భయపడుతున్నవా.? (2)
నీ భారమంతా - మోయువాడు యేసూ..
నీ బాధలన్నీ - తీర్చువాడు యేసూ...(2) ( చూస్తూ)