ఎబినేశారీసౌంగలిరిక్స్, telugu, jhonjebrage Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Jon |
Singer : | Jhonjebrage, samuel |
Composer : | Jhon |
Publish Date : | 2023-10-23 18:00:25 |
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||
ఎడారిలో ఉన్న నా జీవితమును
మేలుతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||
నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||
జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపేఆశ్చర్యమాశ్చర్యమే (2)నీ పాత్రను కానే కానుకేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||