DreamPirates > Lyrics > Antarani Vadavanttu Lyrics

Antarani Vadavanttu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-09 15:13:25

Antarani Vadavanttu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Joel Kodali
Singer : Desmond John
Composer : Joel Kodali
Publish Date : 2023-08-09 15:13:25

Antarani Vadavanttu Lyrics


Song Lyrics :

అంటరాని వాడ వంటు నన్ను ఊరు బైటకు త్రోసి వేసిరి దేహమంతా కుళ్లిపోయి దుర్వాసనతో నిండి పోయే ఐన వారు కానరాక భుజము తట్టే వారు లేక కంటి నిండా నిదుర పొక ఒంటరిగా జీవించలేక మరణమును బ్రతిమాలుకున్నా మరణమును బ్రతిమాలుకున్నా అదియు నన్ను ముట్ట లేదు చావలేక బ్రతుకలేక విసికిపోయాను నేను అలసిపోయాను నీ దరికి చేరాను నిన్నే నమ్ముకున్నాను. యేసు యేసు యేసు నా తట్టు తిరగవా యేసు యేసు యేసు నా గోడు వినవా

నిలిచిపోయావు నా కేక వినగానే

కదలి పోయావు నా స్థితిని చూడగానే నీ కడుపులోని దుఖమును నీ ముఖముపై చూసి నేను కరిగిపోయాను నీ కనికరము చూసి కన్నీటితో తడిసిపోయాను యేసు యేసు యేసు నీకెంత జాలి చాలు చాలు చాలు నీ దయయే చాలు

2

నన్ను తాకావు నీ చేతులను చాపి కుష్టు రోగము నా దేహము పైన ఉండగానే నా గుండె లోపల మండుచున్న కోరికను చూసి నన్ను ముట్టుకున్నావు ఆ స్పర్శకొరకే కదా నే తపియించి పోయాను యేసు యేసు యేసు నీలా ఉందురెవరు చాలు చాలు చాలు నీ స్పర్శ చాలు

స్వస్థపరిచావు శుద్ధునిగా చేసావు మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు నాకు బ్రతుకు నిచ్చావు నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరూ యేసు యేసు యేసు దండములు నీకు చాలు చాలు నాకింక నీవే చాలు

Tag : lyrics

Relative Posts