Dhumme Dhulipelaa | Jawan | Anirudh Ravichander Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Chandrabose |
Singer : | Anirudh Ravichander |
Composer : | Anirudh Ravichander |
Publish Date : | 2023-10-30 04:50:15 |
సిన్ని గుండె నేడే ఆడమన్నదే
అయినా బిడియమేదో ఆపే… (రెడీ)
దుమ్మే దులిపేలా ఎగిరి ఎగిరి దూకెయ్
ధూలే రేగేలా ఎగిరి దుముకురా
భూమే బెనికేలా అదర అదరగొట్టెయ్
నింగే వణికేలా ఎగిరి దుముకురా
ఉడుకు దుడుకు ఉండాలోయ్
ఉరుకు పరుగు ఉండాలోయ్
చురుకు చమకు ఉండాలోయ్
ఉంటేనే మనిషండోయ్
చిలిపితనము ఉండాలోయ్
చెలిమి గుణము ఉండాలోయ్
కరుణ తపన ఉండాలోయ్
ఉంటేనే మనిషండోయ్
ఊపిరి వెచ్ఛంగా, ఊహలు పచ్చంగా
హృదయము స్వచ్చంగా
ఉంటే మనిషండోయ్
హేయ్, హృదయము స్వచ్చంగా
ఉంటే మనిషండోయ్
ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే
మగాళ్ళిలా చలించనే
ఆడే వాడే అందరివాడు
అందరి కోసం ఆడాలే
ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే
లోకంలో నువ్వే లేవంటాను
నీలోనే లోకం ఉందంటాను
ప్రేమించే తత్వం చాలంటాను
వేరే వేదాంతం వద్దంటాను
ఎగుడు దిగుడు కలపాలోయ్
అడుగు నీడ కలవాలోయ్
కలుపుగోలుగుండాలోయ్
ఉంటేనే మనిషండోయ్
ఉడుకు దుడుకు ఉండాలోయ్
ఉరుకు పరుగు ఉండాలోయ్
చురుకు చెమకు ఉండాలోయ్
ఉంటేనే మనిషండోయ్
కొంచెం సరదాగా, కొంచెం మర్యాద
అంతా మనసారా ఉంటె మనిషండోయ్
అరె, అంతా మనసారా ఉంటె మనిషండోయ్
ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే
మగాళ్ళిలా చలించనే
ఆడే వాడే అందరివాడు
అందరి కోసం ఆడాలే
ధక్ ధక్ ధడకు ధడకు
దరువు రాగానే