DreamPirates > Lyrics > KUMMARI O KUMMARI SONG LYRICS Lyrics

KUMMARI O KUMMARI SONG LYRICS Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-11 15:01:16

KUMMARI O KUMMARI SONG LYRICS Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Vedala Hema Chandra & Sireesha Bhagavatula
Composer :
Publish Date : 2023-05-11 15:01:16

KUMMARI O KUMMARI SONG LYRICS Lyrics


Song Lyrics :

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా - చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని – పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి - సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి|| విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా - సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి|| లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్ మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్ - నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||

Tag : lyrics

Relative Posts