DreamPirates > Lyrics > Mallika Mallika Song Lyrics | Shaakuntalam Movie songs| Samantha Lyrics

Mallika Mallika Song Lyrics | Shaakuntalam Movie songs| Samantha Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-21 00:00:00

Mallika Mallika Song Lyrics | Shaakuntalam Movie songs| Samantha Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Chaitanya Prasad
Singer : Ramya Behara
Composer : Mani Sharma
Publish Date : 2023-01-21 00:00:00

Mallika Mallika Song Lyrics | Shaakuntalam Movie songs| Samantha  Lyrics


Song Lyrics :

మల్లికా మల్లికా… మాలతీ మాలికా
చూడవా చూడవా… ఏడి నా ఏలికా
మల్లికా మల్లికా… మాలతి మాలికా
చూడవా చూడవా… ఏడి నా ఏలిక

హంసికా హంసికా… జాగునే సేయకా
పోయిరా పోయిరా… రాజుతో రా ఇక
అతనికో కానుక… ఈయనా నేనిక
వలపుకే నేడొక… వేడుక కాగా

మహ నీలవేణి పూచే పూల ఆమని
రాజే చెంత చేరా.. రాజ్యాన్నేలు మా రాణి
మునుల ఘనుల మన వనసీమ
మరుని శరము పరమా
మధుర సుధల సుమమా, ఆ ఆ
మనసు నిలుపతరమా

స్వప్నికా చైత్రికా
నా ప్రియ నేత్రికా
చూడవా చూడవా
ఏడి నా ఏలికా

సాగుమా మేఘమా, (మేఘమా)
సాగుమా మేఘమా… స్వామినే చేరుమా
వానలే వీణలై… మా కథే పాడుమా
నీ చెలీ నెచ్చెలీ… చూలు దాల్చిందని
శీఘ్రమే రమ్మని… మార్గమే చూపుమా

మిల మిలా మెరిసెలే శారదాకాశమే
వెలవెలా వెన్నెలై… వేగే మా ప్రేమే
తార తోరణాలై తీర్చే నింగి దారులే
నేలే పాలపుంతై నింపే ప్రేమ దీపాలే

మరుల విరుల రసఝరి లోనా
మనసు తడిసె లలనా
అమల కమల నయనా
తెలిసె హృదయ తపనా
ఆకులో ఆకునై… ఆశ్రమ వాసివై
ఆశగా చూడనా… ఆతని రాకకై

ఓ చెలి ఓ చెలీ… ఎందుకే ఈ చలి
భూతలం నా మది… శీతలం అయినది
మంచులే ముంచిన… ఎంత వేధించినా
ఆతని అంశనే… వెచ్చగా దాచని
శిశిరమే ఆశలా… ఆకులే రాల్చిన
చిగురులే వేయగా చైత్రమే కానా

హేమంతాలు ఏలా… సీమంతాల వేళలో
చిందే ఏలా బాల… వాసంతలే నీలోనా
నెలలు గడచినవి నెలబాల
కదలి కడలి అలలా
అమర విమల సుమమా
సుగుణ మణిని కనుమా

కన్నులే వేచేలే… కాయలే కాచేలే
ఆశగా చూడగా… ఆతని రాకకై

Tag : lyrics

Watch Youtube Video

Mallika Mallika Song Lyrics | Shaakuntalam Movie songs| Samantha  Lyrics

Relative Posts