DreamPirates > Lyrics > Ninnu Gasetedu Neelakantude Maha Shivaratri folk Telugu song Madhupriya Lyrics

Ninnu Gasetedu Neelakantude Maha Shivaratri folk Telugu song Madhupriya Lyrics

Author: DreamPirates | Last Updated : 2024-03-07 09:01:01

Ninnu Gasetedu Neelakantude Maha Shivaratri folk Telugu song Madhupriya Lyrics

Film/Album :
Language : Portuguese (Brazil)
Lyrics by : Dileep Devgan
Singer : Madhupriya
Composer : Naveen J
Publish Date : 2024-03-07 09:01:01

Ninnu Gasetedu Neelakantude  Maha Shivaratri folk Telugu song   Madhupriya Lyrics

Song Lyrics :

ఎవడు ఎవడెవడు నీ పుట్టుకను రాసేటోడు ఎవడు ఎవడెవడు నీ సితినే పెర్చేటోడు

ఎవడు ఎవడెవడు నీ బతుకును మోసేటోడు ఎవడు ఎవడెవడు కన్నీళ్లను తుడ్సేటోడు

నల్లని బూడిదే తన పెయ్యంత గంధమే కొప్పున జటిముడులా కురులల్లిన లింగమే

డమ డమ డమ డమరుక ధ్వని తాండవాల శబ్దమే ముల్లోకాలేలే ముక్కంటి ఈశ్వరుడే

నిన్ను గాసేటోడు నీలకంటుడే.,.. ఏ.. జగాలనేలేటోడు జంగమవాడే....ఏ..

నిన్ను గాసేటోడు నీలకంటుడే.,.. ఏ.. జగాలనేలేటోడు జంగమవాడే....ఏ..

చరణం: 1

నెత్తిన మోస్తివిగా గంగమ్మనే..... అందుకే అంటారేమో గంగాధరుడే

ఎదలో దాస్తివిగా పార్వతమ్మనే.... అందుకే అంటారేమో అర్ధనారీశ్వరుడివే

నీ కంటి సూపుతో సాలు రాస్తవు సావు పుటుకలు

నీ సేతి నీడనే సాలు మా బ్రతుకే వందేళ్లు

అంతట నీవే రా అనంతము నీవు రా శూన్యమే నీది కానీ స్మశానమే ఇల్లు రా

నిన్ను గాసేటోడు నీలకంటుడే.,.. ఏ.. జగాలనేలేటోడు జంగమవాడే....ఏ..

నిన్ను గాసేటోడు నీలకంటుడే.,.. ఏ.. జగాలనేలేటోడు జంగమవాడే....ఏ..

ఏ.... హే హే..... ఏ.... హే హే.... ఏ ..... హేహే....

ననా... ననా.. ననా...హే హే.. ననా...ననా.... హే హే..

చరణం : 2

ఏడాదికోక్కసారి నీ పండుగే ఉపవాసముంటామయ్య ఎండికొండకే

జోడి మొక్కుతామే జంగమయ్యకే సల్లని సూపు సూసే జోగులయ్యకే

తీరొక్క పూజలే నీకు తలస్నానాలే శివకు దిగ దిగ దిగంబరునికి ధూపాదీపా కాంతులే

అండ పిండ బ్రహ్మాండా నీవేలే మా అండ పిలవగానే పలికే పార్వతిపరమేశ్వర

నిన్ను గాసేటోడు నీలకంటుడే.,.. ఏ.. జగాలనేలేటోడు జంగమవాడే....ఏ..

నిన్ను గాసేటోడు నీలకంటుడే.,.. ఏ.. జగాలనేలేటోడు జంగమవాడే....ఏ..

Tag : lyrics

Watch Youtube Video

Ninnu Gasetedu Neelakantude  Maha Shivaratri folk Telugu song   Madhupriya Lyrics

Relative Posts