DreamPirates > Lyrics > Gangaa Lyrics

Gangaa Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-31 13:26:17

Gangaa Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Chandrabose garu
Singer : S.P Charan , Sunitha
Composer : M.M keeravaani
Publish Date : 2023-08-31 13:26:17

Gangaa Lyrics


Song Lyrics :

​​​​​​ ధింతననన ధింతన ధింతన

 • గంగా...
  నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
  సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా

  గంగా... నిజంగా...
  నువ్వే నాలో సగభాగంగా
  నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
  సరిగమలై సాగంగా నాలో సగభాగంగా

  నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
  సరిగమలై సాగంగా నాలో సగభాగంగా

  నువ్విచ్చిన మనసే క్షేమం
  నువ్వు పంచిన ప్రేమే క్షేమం
  నువ్వయి నేనున్నాను క్షేమంగా
  మనమాడిన ఆటలు సౌఖ్యం
  మనసాడినమాటలు సౌఖ్యం
  మనువయ్యె కలలున్నాయి సౌఖ్యంగా
  నీ చెవి వినని ఈ సందేశం నా చదువుకు భాగ్యంగా
  ప్రతిపదమున నువ్వు ప్రత్యక్షం
  శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా

  గంగా... నిజంగా...
  నువ్వే నాలో సగభాగంగా
  నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
  సరిగమలై సాగంగా నాలో సగభాగంగా

  నువు పంపిన జాబుల పూలు
  నా సిగలో జాజులుకాగా
  దస్తూరి నుదుటన మెరిసే కస్తూరిగా
  నీ లేఖల అక్షరమాల నా మెడలో హారంకాగా
  చేరాతలు నా తలరాతను మార్చంగా
  నువ్ రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా
  నువ్ చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా

  గంగా... నిజంగా...
  నువ్వే నాలో సగభాగంగా
  నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
  సరిగమలై సాగంగా నాలో సగభాగంగా

  నీ ఉరుకులె రాగంగా నా గుండెల మోగంగా
  సరిగమలై సాగంగా నాలో సగభాగంగా

  ధింతననన ధింతన ధింతన

Tag : lyrics

Relative Posts