DreamPirates > Lyrics > యెహోవా నా బలమా | Telugu Christian Song | Dr Jayapaul Lyrics

యెహోవా నా బలమా | Telugu Christian Song | Dr Jayapaul Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-10 12:15:14

యెహోవా నా బలమా | Telugu Christian Song | Dr Jayapaul Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Dr. N. Jayapaul
Composer :
Publish Date : 2023-06-10 12:15:14

యెహోవా నా బలమా | Telugu Christian Song | Dr Jayapaul Lyrics


Song Lyrics :

యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం } 2|| యెహోవా ||

  1. నా శత్రువులు నను చుట్టిననూ
    నరకపు పాశములరికట్టిననూ } 2
    వరదవలె భక్తిహీనులు పొర్లిన } 2
    విడువక నను ఎడబాయని దేవా } 2|| యెహోవా ||
  2. మరణపుటురులలో మరువక మొరలిడ
    ఉన్నతదుర్గమై రక్షనశృంగమై. } 2
    తన ఆలయములో నా మొఱ్ఱ వినెను } 2
    ఆదరెను ధరణి భయకంపముచే } 2|| యెహోవా ||
  3. నా దీపమును వెలిగించువాడు
    నా చీకటిని వెలుగుగా చేయును } 2
    జలరాసులనుండి బలమైన చేతితో } 2
    వెలుపల చేర్చిన బలమైన దేవుడు } 2|| యెహోవా ||
  4. పౌరుషముగల ప్రభు కొపింపగా
    పర్వతముల పునాదులు వణకెను } 2
    తన నోటనుండి వచ్చిన అగ్ని } 2
    దహించివేసెను వైరులనెల్లన్ } 2|| యెహోవా ||
  5. మేఘములపై ఆయన వచ్చును
    మేఘములను తన మాటుగ జేయును } 2
    ఉరుముల మెరుపుల మెండుగ జేసి } 2
    అపజయమిచ్చును అపవాదికిని } 2|| యెహోవా ||
  6. దయగలవారిపై దయ చూపించును
    కఠినులయెడల వికటము జూపును } 2
    గర్విష్టుల యొక్క గర్వమునణుచును } 2
    సర్వమునెరిగిన సర్వాధికారి } 2|| యెహోవా ||
  7. నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
    ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి } 2
    రక్షణ కేడెము నాకందించి. } 2
    అక్షయముగ తన పక్షము జేర్చిన } 2|| యెహోవా ||
  8. యెహోవా జీవముగల దేవా
    బహుగా స్తుతులకు అర్హుడ నీవే } 2
    అన్యజనులలో ధన్యత చూపుచు } 2
    హల్లెలూయ స్తుతిగానము చేసెద } 2|| యెహోవా ||

Tag : lyrics

Relative Posts