DreamPirates > Lyrics > దీనుడా  అజేయుడా Hosanna Ministries Lyrics

దీనుడా  అజేయుడా Hosanna Ministries Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-02 01:47:59

దీనుడా  అజేయుడా Hosanna Ministries Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Hosanna Ministries
Singer : Pas.JOHN WESLEY
Composer : Hosanna Ministries
Publish Date : 2023-08-02 01:47:59

దీనుడా  అజేయుడా Hosanna Ministries  Lyrics


Song Lyrics :

  1. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా
    పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2
    జీవదాతవు నీవని శృతిమించి పాడనా
    జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2
    అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే
    స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే|| దీనుడా ||




  2. సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
    గమనములేని పోరాటాలే తరుముచుండగా
    నిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండా
    హేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2
    సంతోషము నీవే అమృత సంగీతము నీవే
    స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే|| దీనుడా ||
  3. సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై
    నిత్యనిబంధన నాతో చేసిన సత్యవంతుడా
    విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసేద
    కరుణనీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా } 2
    కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా
    విశ్వాసము నీవే విజయశిఖరము నీవేగా|| దీనుడా ||
  4. ఊహకందని ఉన్నతమైనది దివ్యనగరమే
    స్పటికము పోలిన సుందరమైనది నీరాజ్యమే
    ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
    అమరలోకాన నీసన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను} 2
    ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా
    ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా

Tag : lyrics

Relative Posts