DreamPirates > Lyrics > Yudda Veeruda || Bro. M. Anil Kumar|| telugu christian song Lyrics

Yudda Veeruda || Bro. M. Anil Kumar|| telugu christian song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-10 12:01:29

Yudda Veeruda || Bro. M. Anil Kumar|| telugu christian song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Bro. M. Anil Kumar
Composer :
Publish Date : 2023-06-10 12:01:29

Yudda Veeruda || Bro. M. Anil Kumar|| telugu christian song  Lyrics


Song Lyrics :

యుద్ధ వీరుడా కదులుముందుకు పాలు తేనెల నగరకు
వెట్టిచాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు
లేదు మనకిక అపజయం యేసు రక్తమె మన జయం
హల్లెలూయ ! హొసన్న ! (3) మనదే విజయం
హల్లెలూయ ! హొసన్న ! (3) మనదే విజయం

1. ఏదేమైన గాని ఎదురేమున్నా గాని ముందుకే పయనము
ఎర్రసంద్రమైన యెరికో గోడలైన మేం వెనుకడుగు వేయము
యేసుడే సత్య దైవం అంటూ సిలువను చాటుతాం
అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుతాం ||లేదు మనకిక||

2. పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభమై ప్రభువు తోడుండగా
చింతయే లేదుఏ కొదువ లేదు నిస్సత్తువే రాదుగా
ఆకలి తీర్చి మన్నా కురియును యేసుని నీడలో
దాహము తీర్చ బండయే చీలెను కలువరి సిలువలో ||లేదు మనకిక||

3. గొర్రెపిల్ల రక్తం దివ్య వాక్యం మాకిచ్చెను బహుబలం
శక్తిచేత కాదు బలము చేత కాదు ప్రభు ఆత్మతో గెలిచెదం
యేసుని గొప్ప వాగ్ధానములే నింపెను నిబ్బరం
యేసుని యందు వశ్వాసమె మా విజయపు సూచకం ||లేదు మనకిక||

Tag : lyrics

Relative Posts