DreamPirates > Lyrics > MANCHELENI NAAPAINA || మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు || A.R.Stevenson || Symphony Music Lyrics

MANCHELENI NAAPAINA || మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు || A.R.Stevenson || Symphony Music Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-10 11:57:00

MANCHELENI NAAPAINA || మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు || A.R.Stevenson || Symphony Music Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Dr. A.R.Stevenson
Singer : Malavika
Composer : Dr. A.R.Stevenson
Publish Date : 2023-06-10 11:57:00

MANCHELENI NAAPAINA || మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు || A.R.Stevenson || Symphony Music Lyrics


Song Lyrics :

మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు (2)
ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు (2)
పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి (2)
ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా
యేసు నీ ఋణము తీరునా (2) || మంచే లేని||

లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు (2)
నీదెంత దీన మనస్సు – నా కెంత ఘనత యేసు (2)
ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా
యేసు నీ ఋణము తీరునా (2) || మంచే లేని||

చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు
వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు (2)
నీ సాటిలేని త్యాగం – నా పాలి గొప్ప భాగ్యం (2)
ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా
యేసు నీ ఋణము తీరునా (2) || మంచే లేని||

Tag : lyrics

Relative Posts